Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోనాల్డ్ రోస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు మొదటి రౌండ్ సీట్ల కేటాయింపులో 85 మంది ఐఐటీ,49మంది ఎన్ఐటీలో ప్రవేశం పొందారని ఆ సంస్థల కార్యదర్శి రోనాల్డ్‌రోస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాదిలోనే ఏడుగురు విద్యార్థులు త్రిబుల్ఐటీ, 12మంది గవర్నమెంట్ పౌండెడ్ టెక్నికల్ సంస్థల సీట్లు సాధించారని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారిలో వ్యవసాయ కూలీలు, రోజువారీ కూలీ కార్మికులు, ఆటో, సెక్యూరిటీ గార్డుల కుమారులతోపాటు ఇతర చిన్న పనులు చేసుకునే వారి పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం నాణ్యమైన ఉచిత కోచింగ్ అందించటం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.కార్పొరేట్ రంగానికి సమానంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఇలాంటి విజయాలు సాధించటం అభినందనీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఇందులో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని తెలిపారు.