Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీబీవీ సిబ్బంది నిరసన
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
వేతనాలు పెంచాలని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది గురువారం నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 60ని మోడల్ స్కూల్, కేజీబీవీ నాన్-టీచింగ్, వర్కర్స్కు వర్తింపజేయాలని కోరారు. ఆ జీవో ప్రకారం అటెండర్, స్వీపర్, స్కావెంజర్, వాచ్ ఉమెన్లకు నెలకు రూ.15,600, కంప్యూటర్ ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లకు రూ.19,500, అకౌంటెంట్, ఏఎన్ఎంలకు రూ.22,750 వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సిబ్బంది పద్మ, లక్ష్మీ, సుకన్య, విజయ, భాగ్యలక్ష్మి, వెంకట్రావమ్మ, భూదేవి, సత్యమ్మ, వెంకటలక్ష్మి, కనక శైలజ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.