Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఎన్నికల సంఘానికి టీపీసీసీ నేతల వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హుజూరాబాద్ ఉపఎన్నికలో డబ్బు, మద్యం ఏరులైపాతున్నదని టీపీసీసీ పేర్కొంది. అప్రజాస్వామికంగా జరుగుతున్న ఉపఎన్నికను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈమేరకు గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్కు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, సీనియర్ నాయకులు కుసుమకుమార్, హర్కర వేణుగోపాల్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఓటర్లకు డబ్బులు సీల్డ్కవర్లో పంచుతున్నారని పేర్కొన్నారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అప్రజాస్వామ్యంగా జరుగుతున్న ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కంటే వేలంపాట పెట్టడం ఎంతో మేలని తెలిపారు. ఆ రెండు పార్టీలు ఎన్నికను రాజకీయ వ్యభిచారంగా మార్చాయని ఆరోపించారు. ఎన్నికల కోడ్ను సైతం ఆపార్టీలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. ఆ పార్టీలకు ఓటు వేయకపోతే పెన్షన్లు ఇవ్వమంటూ ఓటర్లను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆయా పార్టీల కన్నుసన్నల్లో పని చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉపఎన్నికను వెంటనే రద్దు చేసి, నిష్పక్షపాత ఎన్నికల అధికారిని నియమించి మళ్లీ ఎన్నికను నిర్వహించాలని వారు కోరారు.