Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయా కలెక్టరేట్లలో నిర్వహణ
- పాల్గొననున్న మంత్రులు అల్లోల, సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై జిల్లా స్థాయిలో అఖిల పక్ష సమావేశాలను పెట్టాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తొలి దశలో నాలుగు జిల్లాల్లో శనివారం నిర్వహించనున్నారు. వీటికి ఆయా పార్టీల నేతలతో పాటు అటవీ, రెవెన్యూ, గిరిజన, పంచాయతీరాజ్ శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఉదయం రెండు జిల్లాలు, మధ్యాహ్నం రెండు జిల్లాల కలెక్టరేట్లలో ఇవి జరుగనున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సమావేశాలు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరుగనున్నాయి. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అఖిల పక్షాల సమావేశాలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వం వహించనున్నారు. నవంబర్ ఒకటో తేదీన మంచిర్యాల కలెక్టరేట్లో అఖిలపక్ష సమావేశం జరుగనున్నది. నవంబర్ ఎనిమిదో తేదీ నుంచి పోడు భూములకు దరఖాస్తులు స్వీకరించనున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సమావేశాల్లో ఇప్పటివరకు పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు తదితరులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కులు కల్పిండంతో పాటు, అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.