Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాఠశాలలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్కు ప్రముఖ యాంకర్ అనసూయ శుక్రవారం ట్వీట్టర్ద్వారా ఫిర్యాదు చేశారు. ''డియర్ కేటీఆర్ సర్.. అసలు లాక్డౌన్ ఎందుకు వచ్చిందో.. ఆపై అన్లాక్ కూడా ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి.. మనందరికీ వ్యాక్సిన్ వేస్తున్నామని కాస్త భరోసా ఇవ్వొచ్చు.. అయితే టీకా వేయాల్సిన వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంగతేంటి సార్? పాఠశాలలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తు న్నాయి'' అని ట్వీట్ చేశారు. మరొక ట్వీట్లో ''పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు వారికి ఏమైనా జరిగితే మాకు బాధ్యత లేదని పాఠశాల యాజమాన్యాలు సంతకం చేయించుకుంటున్నాయి.. ఇది ఎంతవరకు న్యాయమో.. మీరే చెప్పండి సార్... మీరు ఎప్పటిలాగే మాకు సరైన మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాను'' అంటూ అనసూయ అసహనం వ్యక్తం చేశారు.