Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరి పంట వేయాలా? వద్దా? అనే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మెన్ అన్వేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నవంబర్ ఒకటో తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ ప్రణాళిక లేదన్నారు. వరి సాగు విషయంలో మంత్రులు తలోమాట మాట్లాడుతూ రైతులను గందరగోళపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పండే భూముల్లో ఇతర పంటలు పండే అవకాశం లేదనీ, అయినా వరి సాగు వద్దనడమేంటని ప్రశ్నించారు.
ప్రశాంత్ కిషోర్ ఒక అద్దెమైక్ : మల్లు రవి
బీజేపీ దేశ రాజకీయాలను మరో 40 ఏండ్లపాటు శాసిస్తుందనీ, కాంగ్రెస్ ప్రశాంత్‌కిషోర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఖండించారు. కాంగ్రెస్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. పీకే ఎవరు డబ్బులిస్తే వారి తరపున మాట్లాడే అద్దెమైక్ లాంటివాడని విమర్శించారు. ఒక రాజకీయ దళారీగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.