Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనబోమని ఎక్కడా చెప్పలేదనీ, బాయిల్డ్ రైస్‌ను మాత్రమే వద్దన్నదని బీజేపీ ఎంపీ డి.అర్వింద్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వరి సాగుపై నిరంకుశత్వంగా వ్యవరిస్తోందన్నారు. రాష్ట్రంలో అడ్వాన్స్డ్ మిల్లులు ఎక్కడా లేవన్నారు. మిల్లుల దగ్గర 20 శాతం కమీషన్ తీసుకుంటున్నారని విమర్శించారు. ఎనిమిదేండ్లలో ఎవరికీ బోనస్ ఇవ్వలేదన్నారు. హుజురాబాద్ కలెక్టర్ వరి విత్తనాలు అమ్మోద్దంటే..గంజాయి విత్తనాలు అమ్మాల్నా అని ప్రశ్నించారు. అధికారులు బానిస బతుకులు బతకొద్దనీ, ప్రజలకు కొంచమైనా మేలు చేయాలని కోరారు. వరి వద్దంటున్న సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ఎందుకు కడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పండించిన ప్రతి గింజనుకొంటానన్న కేసీఆర్ ఎందుకు మాట్లాడడు? తెలంగాణ బ్రాండ్‌తో బియ్యాన్ని మార్కెటింగ్ చేస్తామన్న కేసీఆర్ ఎక్కడీ అని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటనపై మంత్రి నిరంజన్ రెడ్డితో చర్చించేందు ప్రగతి భవన్కైనా, తెలంగాణ భవన్కైనా వెళ్లేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు.
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనరేట్ ముట్టడి
వరి సాగు చేయొద్దంటూ కేసీఆర్ ప్రభుత్వం ఆంక్షలను నిరసిస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వ్యవసాయ కమిషనరేట్‌ను శుక్రవారం ముట్టడించారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పలు పోలీస్స్టేషన్లకు తరలించారు.