Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరణి పోర్టల్‌కు ఏడాది పూర్తి...బుక్లెట్ ఆవిష్కరించిన రాష్ట్ర సర్కారు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూ పరిపాలనా రంగంలో దేశంలోనే అతి పెద్ద సంస్కరణ ధరణి పోర్టల్ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. ఆ పోర్టల్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఏడాదిలో ధరణి ద్వారా సాధించిన విజయాలను తెలిపే ప్రత్యేక బుక్‌లెట్‌ను సీఎస్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ..ధరణి అనేది దేశ భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మక కార్యక్రమం అన్నారు. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పం ద్వారానే విజయం సాధ్యమైందని అన్నారు. ఏడాదిలో ధరణి పోర్టల్ ను 5.14 కోట్ల మంది దర్శించారనీ, పదిలక్షలకు పైగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపా ల వల్ల భూముల ధరలు ఒక్కసారిగా నాలుగైదు రేట్లు పెరిగాయనీ, ఈ పరిస్థితుల్లో కేవలం ధరణి వల్లనే భూ రికార్డులను భద్రపర్చగలమన్నారు. రికార్డులను తారు మారు చేసే పరిస్థితులు లేనందునే రాష్ట్రంలో ఏవిధమైన భూ వివాదాలు తలెత్తడం లేదని పేర్కొన్నారు. గతంలో కేవలం 141సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగేవనీ, ధరణి ప్రారంభం అనంతరం వీటికి అదనంగా 574 తహసీల్దార్ కార్యాల యాల్లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించామని గుర్తు చేశారు. ధరణి ఇంతలా జయప్రదం చేయడానికి శ్రమించిన సీనియర్ అధికారులు, వందలాది మంది ఐటీ నిపుణులను ఆయన అభినందించారు. ధరణి పోర్టల్ రూపక ల్పనలో భాగస్వామ్యులైన అధికారులు ఈ సందర్భంగా తమ అనుభవా లను వెల్లడించారు. ఆయా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.