Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన
నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో రెండో తరగతి చదువుతున్న పాపపై రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు, సర్పంచ్ భర్త రాధా రపు శంకర్ గురువారం లైంగికదాడికి పాల్పడ్డాడనీ, బాధితు లకు న్యాయం చేయాలంటూ గిరిజన సంఘం నాయకులు, స్థానికులు శుక్రవారం మండల కేంద్రంలో ఆందోళనకు దిగారు. శంకర్‌ను వెంటనే అరెస్ట్ చేసి, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్‌లోని సిరిసిల్ల - కామారెడ్డి ప్రధాన రహదారిపై బైటాయించారు. సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. సీఐ మొగిలి, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వెంకటకృష్ణ, వీర్నపల్లి ఎస్ఐ నసీర్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళన విరమించలేదు. జిల్లా ఎస్పీ వచ్చి నిందితునికి కఠిన శిక్ష విధిస్తామని హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఘటనా స్థలానికి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ వచ్చి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.