Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసిన పాత గెస్ట్ లెక్చరర్లను కొనసాగించడం పట్ల విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని గెస్ట్ లెక్చరర్ల సంఘం (2152) నాయకులు సత్కరించారు. శుక్రవారం హైదరాబాద్‌లో సంఘం అధ్యక్షులు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ నేతృత్వంలో ఆమెను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గెస్ట్ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఏటా తమ సర్వీసులను పునరుద్ధరించాలనీ, ప్రతినెలా జీతాలు వచ్చేలా చూడాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల అభివృద్ధికి గెస్ట్ లెక్చరర్లు పాటుపడాలని సబిత కోరారు. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సహకరించాలని సూచించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొని విజయవంతం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర నాయకులు కె మహేష్‌కుమార్, ఎం బాబురావు, ఎస్ వెంకటేష్, కవిత, రీనా, హరిత, ఇస్సాక్, యుగంధర్, కృష్ణ, రాంచందర్, ఎన్ కిరణ్, సారయ్య, శ్రవణ్, రాము, రవివర్మ తదితరులు పాల్గొన్నారు.