Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్) 2019 బ్యాచ్‌కు చెందిన నలుగురు అధికారుల బృందం శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించింది. సీఈవో ఆర్.శైలేష్రెడ్డిని కలిసిన బృందం టి-సాట్ నిర్వహణ గురించి తెలుసుకొని కార్యాలయంలోని స్టూడియో, పీసీఆర్, ఎర్త్ స్టేషన్ పనితీరును బృందం సభ్యులు పరిశీలించారు. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఐఐఎస్ 2019 బ్యాచ్‌కు చెందిన ఆశీష్ గోయల్, డి.బాలనాగేంద్రన్, కె.అనురాగ్ కుమార్, శ్రీ సాయి వెంపటి బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా సీఈవో శైలేష్‌రెడ్డి మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా టి-సాట్ నెట్వర్క్ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. కేవలం ఆర్వోటీ పద్ధతిలో ప్రసారాలను అందించే టి-సాట్ నెట్వర్క్ మంత్రి కేటీఆర్ చొరవతో కేబుల్, డీటీహెచ్, శాటిలైట్ విభాగాలతో పాటు డిజిటల్ మీడియాలోనూ వివిధ రంగాలకు విస్తరించిన సేవల విధానాన్ని వివరించారు.