Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిఘటనోద్యమాలకు వేదికగా సీఐటీయూ జనరల్ కౌన్సిల్ : ఎం.సాయిబాబు
- ఎస్సీజెడ్ ఐఈఎఫ్ తరఫున రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందజేత
నవతెలంగాణ బ్యూరో హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాల కోసం తమ యూనియన్ కృషి చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు అన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లో వచ్చే నెల 16,17,18 తేదీల్లో సీఐటీయూ జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ సమావేశాల నిర్వహణ కోసం ఎల్ఐసీ ఉద్యోగుల తరఫున రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఎం.సాయిబాబుకు సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఎస్సీజెడ్ ఐఈఎఫ్) నాయకులు టీవీఎన్ఎస్. రవీంధ్రనాధ్, జి.తిరుపతయ్య, ఆధిష్రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సమావేశాల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి జె. వెంకటేష్, కోశాధికారి ఎ. నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, ఎస్. రమ, బి. మధు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి. శ్రీకాంత్, వై. సోమన్న తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడు తూ..కార్మికవర్గం నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళ నేపథ్యంలో జనరల్ కౌన్సిల్ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత నెలకొంద న్నారు.కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు, దేశ వ్యతిరేక జాతీయ ఆస్తుల నగదీకరణ, ప్రజాస్వామ్య వ్యతిరేక నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా ప్రతిఘటనోద్యమాల రూపకల్పనకు సమావేశాలు వేదిక కానున్నాయని తెలిపారు. ఆర్థిక స్వావలంబన, సార్వభౌమత్వ రక్షణ కోసం కార్మిక-ఉద్యోగ సంఘాలతో విశాల ఐక్య కార్మికోద్యమానికి తమ యూని యన్ శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎస్సీజెడ్ ఐఈఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.