Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మౌలిక సౌకర్యాలు :మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో టీఎస్ఐఐసీలో వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉందనీ, విద్యుత్, నీరు, మౌలిక సౌకర్యాలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. పారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగిన 'యాంబిషన్ ఇండియా 2021' బిజినెస్ ఫోరమ్‌లో ఆయన శుక్రవారం కీలకోపన్యాసం ఇచ్చారు. ''కోవిడ్ అనంతర కాలంలో ఇండో-ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్తును రూపొందించడం'' అనే అంశం మీద ఆయన మాట్లాడారు. రాష్ట్రం పారిశ్రామిక రంగంలో పురోగమిస్తున్నదని తెలిపారు. పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. భారతదేశంలో రాష్ట్రాలు భూమి కేటాయింపు, ఆమోదం, అనుమతులు అందించడం, శిక్షణ పొందిన మానవ వనరులను పొందడంలో కంపెనీలకు సహాయం చేయడం, వనరుల సేకరణ విధానాలు వంటి బహుళ కార్యాచరణ అంశాలలో గణనీయమైన స్వయంప్రతిపత్తిని పెంపొందించుకుంటున్నాయని చెప్పారు. పెట్టుబడిదారులకు అనుకూల రాష్ట్రమంటూ టీఎస్ఐపాస్ గురించి వివరించారు.కార్యక్రమంలో తెలంగాణను భాగస్వామ్య రాష్ట్రంగా ఎంపిక చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు
ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అవకాశం
తమ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అనేక అవకాశాలను కల్పించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బందం రెండో రోజు ప్యారీస్‌లో వివిధ గ్లోబల్ సీఈఓలతో సమావేశాలు నిర్వహించింది. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఇటీవల సాధించిన విజయాలను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఫ్రెంచ్ ఎస్ఎంఈలకు తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన సహకారాలను, అవకాశాలను అందిస్తోందని తెలిపారు.టీహబ్, వీహబ్, టివర్క్స్ వంటి వాటి గురించి వివరించారు. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయానికి పెట్టుబడి పెట్టిన ఏడీపీ చైర్మెన్, సీఈవో అగస్టిన్ డి రోమనెట్‌తో సమావేశమైన కేటీఆర్, కరోనా ఆంక్షలు సడలించడంతో ఈ పరిశ్రమ దేశంలో పెద్దఎత్తున విస్తరించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మరో సమావేశంలో ఆయన సనోఫీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ ఫాబ్రిస్ బస్చిరా, గ్లోబల్ వ్యాక్సిన్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ ఇసాబెల్లె డెస్చాంప్స్ను కలిశారు. సనోఫీ త్వరలో తన హైదరాబాద్ ఫెసిలిటీ నుంచి సిక్స్ ఇన్ వన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనుంది.