Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎల్ఎల్బీ - 3 వైడీసీ (2017-2020) బ్యాచ్ విద్యార్థులు హిందూ చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ సాధించారు.ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్స్ ప్రధానం చేశారు. హిందూ చట్టంలో బుసిరెడ్డి లక్ష్మమ్మ, బుసిరెడ్డి చెన్నప్ప రెడ్డి మెమోరియల్ గోల్డ్ మెడల్‌ను తుబా ఫాతిమా పొందారు. షాఫియా బేగం అనే విద్యార్థి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో జస్టిస్ ఎస్.ఓబుల్ రెడ్డి మెమోరియల్ గోల్డ్ మెడల్ సాధించారు. గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లా కాలేజ్ చైర్మెన్ వివేక్ వెంకటస్వామి, సెక్రెటరీ జి.వినోద్, కరస్పాండెంట్ సరోజ వివేక్, ప్రిన్సిపాల్ , సిబ్బంది అభినందనలు తెలిపారు. వారు ఇతర విద్యార్ధులకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు.