Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దిశ ఎన్కౌంటర్ ఘటనపై జస్టిస్ శిరోర్కర్ విచారణ కమిటి నవంబర్ 8వ తేదీ నుంచి తిరిగి విచారణ జరపనుంది. సైబరాబాద్ పోలీసు కమిషన్‌రేట్ పరిధిలో జరిగిన దిశపై సామూహిక లైంగికదాడి, హత్య ఘటనలో నలుగురు నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో జస్టిస్ శిరోర్కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని సుప్రింకోర్టు నియమించిన విషయం తెలిసిందే. విచారణను ప్రారంభించిన కమిటీ ఇప్పటి వరకు ఎన్కౌంటర్లో మరణించిన వారి కుటుంసభ్యులతో పాటు పలువురిని విచారించింది. అంతేగాక ఎన్కౌంటర్ జరిగిన సమయంలో సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్, దర్యాప్తు అధకారి సురేందర్‌రెడ్డి సిట్ చైర్మెన్ మహేష్ భగవత్, పౌరహక్కుల సంఘాల నాయకులు పలువురిని విచారించింది. కాగా దీపావళి పండుగను పురస్కరించుకుని నవంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు విచారణ కమిటీ సెలవు తీసుకుంది. ఎనిమిదవ తేదీ నుంచి తిరిగి విచారణను చేపట్టనుంది. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులను ప్రశ్నించనుంది.