Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన మార్గదర్శకాల జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామీణ మహిళా స్వయం సహాయక బృందాల సభ్యుల వార్షిక ఆదాయం ఏడాదికి కనీసం లక్ష రూపాయలు ఉండే విధంగా చూసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని గ్రామీణాబిృóవద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఈ మేరకు శనివారం ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. లక్ష్యసాధనలో భాగంగా రానున్న రెండేండ్లలో జీవనోపాధి పొందడానికి 250 లక్షల గ్రామీణ ఎస్‌హెచ్‌జి మహిళలకు సహకారం అందించనున్నది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి అమలు కోసం రాష్ట్రాలు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, ట్రాన్ఫోమేషన్ రూరల్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మహిళలకు మరిన్ని జీవనోపాధి అవకాశాలను అందుబాటు లోకి తెచ్చే అంశాలపై చర్చించింది. ఈ కార్యక్రమం ద్వారా 6,768 బ్లాకుల్లో 70 లక్షల స్వయం సహాయక బృందాల ద్వారా 7.7 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందుతారని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.