Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళల న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ మహిళా కమిషన్ ముందుండాలని కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి సభ్యులకు పిలుపు నిచ్చారు. కమిషన్లో నమోదయ్యే కేసులు తక్షణమే పరిష్కారం కోసం లీగల్ సర్వీసెస్ అధికారుల సహకారం తీసుకోవాలని కోరారు. హైదరాబాద్లో శనివారం జరిగిన కమిషన్ సర్వ సభ్య సమావేశానికి సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించగా సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్రా ఈశ్వరీ భాయి, కొమ్ము ఉమాదేవియాదవ్, గద్దల పద్మ, సుదాల లక్ష్మి, కటారి రేవతి రావు, కమిషణ్ కార్యదర్శి సునంధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల రక్షణే ప్రధాన ఎజండాగా పనిచేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా పక్షపాతిగా వ్యవహరిస్తూ రాష్ట్ర మహిళలకు అనేక సౌకర్యాలు, అధికారాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాల వారీగా తరచూ సమావేశాలు నిర్వహించి మహిళా సమస్యలను ముందే గుర్తించి వాటిని పరిష్కరించేందుకు వీలుగా అధికా రులను సమన్వయ పరచాలని సూచించారు. ఈ సందర్భంగా సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది. మహిళా కమిషన్లో నమోదైన కేసులపై సత్వర పరిష్కారం కోసం లీగల్ సర్వీసెస్ అధికారుల సహకారం తీసుకోవాలనీ, మహిళల పట్ల అనుచిత ప్రవర్తను నిరోధించే సెక్షన్లను కఠినంగా అమలు చేయాలని తెలిపారు. అత్యాచార బాధితులకు అందచేసే ఆర్ధిక సహాయాన్ని సత్వరమే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాలని మరో తీర్మానంలో ఆమోదించారు. ప్రతి జిల్లాలో జల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.