Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రవేశం పొందేందుకు ఈనెల 12 వరకు గడువుందని ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు, కోఆపరేటివ్, గురుకులాలు, కేజీబీవీ, ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలు, కాంపొజిట్ డిగ్రీ కాలేజీల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందొచ్చని సూచించారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలను ఈనెల 12 వరకు చేపట్టాలని కోరారు. తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) విజ్ఞప్తి మేరకు ప్రవేశాల గడువును పొడిగించామని తెలిపారు.