Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పెద్దతండాలో సోమవారం చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన చిన్నారి(3) ఇంట్లో ఆడుకుంటుండగా.. వరుసకు బాబాయి అయిన నవీన్ తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టాడు. తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు లైంగికదాడి జరిగినట్టు నిర్ధారించారు. చిన్నారిపై దారుణానికి పాల్పడిన నవీన్ ఎప్పుడూ మద్యం మత్తులో ఉంటాడని, గంజాయి కూడా తీసుకుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.