Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకటెండ్రు చోట్ల భారీ వర్షాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. మంగళ, బుధవారాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వానలు పడొచ్చు. ఒకటెండ్రు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరంలో అల్పపీడనం కొనసాగుతున్నది. ఇది తమిళనాడు మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు విస్తరించి ఉంది. దానికి అనుబంధంగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి యుంది. ఇది రాగల 48 గంటల్లో ఆగేయ అరేబియా సముద్రంలోకి వెళ్లి మరింత బలపడే అవకాశముంది.
ఇది తెలంగాణ నుంచి దూరంగా వెళ్తున్నది. తెలంగాణలో కిందిస్థాయి గాలు లు ఈశాన్య దిశ నుంచి వీస్తున్నవి. సోమవారం నల్లగొండ జిల్లా నాంపల్లి లో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అదే జిల్లా గుర్రంపోడులో 6.5 సెంటీమీటర్ల వాన పడింది. మొత్తంగా 54 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. సోమవారం జీహెచ్ఎంసీ పరిధిలో ఆకాశం మేఘావృతమై కనిపించింది.