Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీట్ యూజీ ఆల్ ఇండియా నెంబర్ వన్ ర్యాంకర్ మృణాళ్ కుట్టేరి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చదువుల్లో తన పనితీరు మెరుగుపరుచుకునేలా తీర్చిదిద్దిన మెంటర్స్, టీచర్స్‌కు నీట్ యూజీ-2021 ఆల్ ఇండియా నెంబర్ వన్ ర్యాంకర్ మృణాళ్ కుట్టేరి ధన్యవాదాలు తెలిపారు. రోజు విడిచి రోజు ఆకాశ్‌లో రాసిన మాక్ టెస్టులు నీట్ ఫైనల్ ఎగ్జామ్ రాసేందుకు తనలో తగిన విశ్వాసాన్ని పెంచాయని చెప్పారు. ఫలితాల వెల్లడి తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఆకాశ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన మృణాళ్ మాట్లాడుతూ రోజువారీ పనుల్లో తగిన బ్యాలెన్స్, చదువులపై ఏకాగ్రత, మధ్య మధ్యలో స్వల్ప బ్రేక్స్ తీసుకున్నట్టు వెల్లడించారు. ''ఆకాశ్‌లోని నా మెంటార్స్ శిక్షణ మొదటి రోజు నుంచి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీఈఆర్టీ) పుస్తకాలు చదవమని చెప్పేవారు. మొదట్లో ఎన్సీఈఆర్టీ మెటీరియల్, ఆకాశ్ వారందించిన ఇతర మెటీరియల్ చాలా కష్టంగా, చాలా ఎక్కువగా అనిపించాయి. కాని, త్వరలోనే లోతుగా చదవడాన్ని అలవాటు చేసుకున్నాను. 45 నిమిషాల పాటు చదివి ఆ తర్వాత 10 -15 నిమిషాలు బ్రేక్ తీసుకునేవాడిని. ఇది బాగా పనిచేసింది నేను టెస్టుల్లో మంచి స్కోర్ సాధించగలిగాను'' అని తెలిపారు. బ్రేక్స్ సమయంలో వీడియో గేమ్స్ ఆడటం లేదా టీవీ చూసేవాడినని చెప్పారు. తన తండ్రి హెచ్ఆర్ కన్సల్టెంట్, తల్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయినా చదువుల విషయంలో ఎప్పుడు ఒత్తిడి చేయలేదని వెల్లడించారు. ''నీట్‌కు సిద్ధపడుతున్న సమయంలో నా హాబీలు వేటిని విడిచిపెట్టలేదు. అలా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో'' అని మృణాళ్ అభిప్రాయపడ్డాడు. లాక్డౌన్ సమయంలో పూర్తిగా ఇంటికి పరిమితమై చదువుకోవటం ఒక మంచి అవకాశమే అయినా....ఇబ్బంది కూడా అంటూ, దాన్ని అనుకూలంగా మార్చుకున్నట్టు చెప్పారు.. ''నీట్ ఎగ్జామ్‌కు నెల ముందు నుంచి ఫ్రెండ్స్‌తో మాట్లాడటం నేను తగ్గించాను. అంతే కాని నీట్ పేరు చెప్పి నేను బయటి ప్రపంచం నుంచి దూరం వెళ్లిపోలేదు'' అన్నాడు.
ఆకాశ్ టీమ్ పాటుపడింది....
ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ చౌదరి వ్యాఖ్యానిస్తూ, ''తెలివైన విద్యార్థుల్లో ఒకడైన మృణాళ్ విజయం కోసం మొత్తం ఆకాశ్ టీమ్ అంతా పాటుపడింది. అతనిలో ఆత్మవిశ్వాసం, స్థిరత్వం మాకు కనిపించింది. చదువుకు అవసరమైన సరైన ఆలోచనతో పాటు వ్యూహాం కూడా అతనికి ఉంది. ఏమైనా సందేహాలుంటే తన టీచర్లు, మెంటార్లతో నివత్తి చేసుకునే అవకాశాన్ని అతను ఏనాడు వదులుకోలేదు. అసైన్మెంట్లు పూర్తి చేయడంలో అతను ఎప్పుడూ ముందుండే వాడు. అనవసరమైన ఒత్తిడి దరి చేయకుండా చూసుకోవడం మృణాళ్‌లో ఉన్న గొప్ప విషయం. అద్భుత విజయం సాధించినందుకు మృణాల్‌ను మేము అభినందిస్తున్నాం. ఉన్నత విద్యలో మరింత రాణించి మెడిసిస్‌లో కెరీర్ సాగించాలని ఆకాంక్షిస్తున్నాం'' అని తెలిపారు.