Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడక్కడా భారీ వర్షం పడే అవకాశం!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందనీ, ఒకటెండ్రు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అరేబియా సముద్రంవైపు వెళ్లిపోయింది. రాష్ట్రం మీదుగా చల్లటి గాలులు వీస్తున్నాయి. ఉపరితల ద్రోణి కొమరిన్ నుంచి తమిళనాడు తీరం మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు వ్యాపించి స్థిరంగా కొనసాగుతున్నది.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో అత్యధికంగా 4.55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.