Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన బాలిక కుటుంబానికి కేటీఆర్ భరోసా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో ఆరేండ్ల చిన్నారిపై జరిగిన లైంగికదాడి ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైద్రాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను గురువారం ఆయన పరామర్శించారు. అధైర్య పడొద్దనీ, అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమనీ, నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనని అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. చిన్నారికి అవసరమైన మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్యులకు సూచించారు.