Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూబ్లీహిల్స్‌లోని హెచ్ అండ్ ఎం షాపింగ్‌మాల్‌లో ఘటన
- ఇద్దరు యువకులు, స్టోర్ మేనేజర్ అరెస్ట్
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ షాపింగ్‌మాల్‌లో దారుణ ఘటన జరిగింది. ఓ యువతి ట్రయల్ రూమ్‌లో డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో షూట్ చేశారు. యువతి కేకలు వేయడంతో ఇద్దరు పోకిరీలతోపాటు స్టోర్ రూమ్ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ జరిధిలో జరిగింది. జూబ్లీహిల్స్ పీఎస్ ఎస్ఐ నరేష్ వివరాల ప్రకారం..జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ టెంపుల్‌కు సమీపంలోగల హెచ్అండ్ఎం షాపింగ్ మాల్లో ఓ యువతి బట్టలు కొనేందుకు వచ్చింది. ట్రయల్ రూమ్‌లో డ్రెస్ మార్చుకుంటుండగా పక్కనే ఉన్న మరో ట్రయల్ రూమ్‌లో నుంచి ఇద్దరు యువకులు కిరీటీ ఆసాట్, గౌరవ కల్యాణ్ సీక్రెట్‌గా సెల్ఫోన్లతో షూట్ చేయడం ప్రారంభించారు. ఇది గమనించిన యువతి కేకలు వేయడంతో దుండగులు బయటకు వచ్చారు. దాంతో అక్కడే ఉన్న కస్టమర్లు పట్టుకొని 100 నెంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరు యువకులతోపాటు షాపింగ్‌మాల్ స్టోర్ మేనేజర్ అమన్‌ను అరెస్టు చేశారు. యువకుల ఫోన్లలో యువతుల వీడియోలు మరిన్ని ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులకు నేరచిత్ర ఉందా? ఇంకెక్కడైనా ఇటువంటి ఘటనలకు పాల్పడ్డారా? షాపింగ్‌మాల్ మేనేజర్ పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.