Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ ఉద్యోగులకు ఎమ్డీ సజ్జనార్ ఉద్బోధ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ ప్రయాణీకుల భద్రత, సంస్థ భవిష్యత్ ఉద్యోగుల చేతుల్లోనే ఉన్నదని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. సంస్థ పురోభివృద్ధిలో సత్తా చాటాలనీ, వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బుధవారంనాడాయన బస్‌భవన్‌లో గూగుల్ మీట్ ద్వారా 11 మంది రీజినల్ మేనేజర్లు, 97 మంది డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు కష్టించి పనిచేసే మనస్తత్వాన్ని ఆయన అభినందించారు. కార్గో, దసరా సెలవులు, పెండ్లిండ్ల సీజన్లలో డ్రైవర్, కండక్టర్ల కృషిని ప్రసంసించారు. వారే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు. ఒకటో తేదీనే జీతాల చెల్లింపు, పీఎఫ్, సీసీఎస్, ఎస్ఆర్బీఎస్, ఈడీఎల్ఐఎఫ్కు విడతలవారీగా నిధుల కేటాయింపు, ఇన్సెంటివ్‌లు, ఆరోగ్య శ్రేయస్సు, తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి ఆధునీకరణ సహా పలు అంశాలను ఆయన సమావేశంలో ప్రస్తావించారు. ప్రతి ట్రిప్పులో ఐదుగురు ప్రయాణీకుల్ని అదనంగా ఎక్కించుకోగలిగితే సంస్థ నష్టాలు తగ్గి, ఆదాయం పెరుగుతుందని సూచించారు. ప్రమాదరహిత క్షేమదాయక ప్రయాణం ఆర్టీసీతోనే సాధ్యమనీ, ఇదే విషయాన్ని ఉద్యోగులు, అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.