Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవిని కాన్పు కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేర్పించగా.. బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. కొంతకాలంగా ఆమె ఈ ఆస్పత్రిలోని గైనకాలజీ విభాగంలో పరీక్షలు చేయించుకుంటూ సలహాలు తీసుకుంటున్నారు. కాగా, మంగళవారం రాత్రి ఎమర్జెన్సీగా ఆపరేషన్ అవసరం అవడంతో ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు, గైనకాలజిస్ట్లు సూరపనేని శ్రీక్రాంతి, డాక్టర్ భార్గవి, అనస్థీషియా వైద్య నిపుణులు దేవిక ఆధ్వర్యంలో సీజేరియన్ చేశారు. ఆపరేషన్ అనంతరం శిశువును ప్రభుత్వ ఏరియాస్పత్రిలోని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వై.రాజశేఖర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. శిశువును పరీక్షించి వైద్యాన్ని అందజేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సామాన్యుడిలా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించటంపై పలువురు అభినందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై మరింత నమ్మకం పెరిగేలా.. అన్ని వర్గాల ప్రజలకు కలెక్టర్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.