Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు డాక్టర్ల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనీ, ఇందుకోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును ప్రభుత్వ డాక్టర్లు కోరారు. హైదరాబాద్‌లో బుధవారం మంత్రిని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాము చేసిన వినతికి మంత్రి సానుకూలంగా స్పందించినట్టు వెల్లడించారు. హరీశ్ రావును కలిసిన వారిలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సెంట్రల్ లీగల్ అధ్యక్షులు పల్లం ప్రవీణ్, ఆ సంఘం ప్రజారోగ్య (డిహెచ్) విభాగం అధ్యక్షులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , గాంధీ మెడికల్ కళాశాల సెక్రెటరీ డాక్టర్ అజ్మీరా రంగా , ఉస్మానియా యూనిట్ ప్రతినిధి డాక్టర్ శేఖర్ , డాక్టర్ వినోద్ , డాక్టర్ రవి తదితరులున్నారు.
మంత్రి హరీశ్‌రావుకు ఉన్నతాధికారుల శుభాకాంక్షలు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన హరీశ్‌రావును ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాస రావు, వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్, కాళోజి వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎమ్డీ చంద్రశేఖర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా మంత్రి వైద్యారోగ్యశాఖ పని తీరుపై సమీక్ష చేశారు.