Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కత్తితో దాడి చేసిన దుండగుడు
నవతెలంగాణ-హయత్ నగర్
తనను ప్రేమించి మరొకరితో నిశ్చితార్థం చేసుకుందని కసి పెంచుకున్న దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. కాగా, పెండ్లికి నిరాకరించిందన్న కారణంతో కరీంనగర్లో ఓ యువతిని గొంతు కోసి చంపిన ఘటన మరుసటి రోజే రాష్ట్ర రాజధానిలో ఈ ఘటన జరగడంతో.. తీవ్ర ఆందోళన కలిగిసోతÊంది. ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం, తిమ్మాపల్లి గ్రామానికి చెందిన బస్వరాజ్ సన్‌సిటీ, రామ్‌దేవ్‌గూడలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అదే జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన యువతి హస్తినాపురంలోని ఆమె బాబాయి ఇంటిలో నివాసం ఉంటోంది. కొంతకాలంగా బస్వరాజ్, యువతి ప్రేమించుకున్నారు. అయితే, యువతి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో మందలించి మూడు నెలల కిందట మరో యువకుడితో నిశ్చితార్థం చేశారు. ఇది తెలిసిన బస్వరాజ్ బుధవారం హస్తినపురంలో ఆమె బాబారు ఇంటికెళ్లి కత్తితో దాడి చేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన యువతిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.