Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'గత ఏడేండ్లలో ఎప్పుడూ మాట్లాడని విధంగా కేసీఆర్ మొన్న విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షంలో కూర్చోవటానికి ఆయన సిద్ధపడుతున్నడటానికి ఇదొక తార్కాణం. ప్రతిపక్షంలో ఉన్నవారికి ధర్నాచౌకే దిక్కు. ఇప్పుడు కేసీఆర్కు కూడా ఆ దిక్కు కూడా గుర్తొస్తున్నదంటే ఆయన ప్రతిపక్షంలో ఉండటానికి సిద్ధపడుతున్నాడని భావించాలి. ప్రజలపట్ల నిజాయితీగా ఉంటే, తప్పులు తెలుసుకుంటే వారు క్షమిస్తారు. అంతేతప్ప డ్రామాలు, నాటకాలకు వారి మనసుల్లో స్థానం ఉండదు. వరి విషయంలో ఆయన ధర్నా అనేది రైతు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. అప్పుడే ప్రజలు ఆమోదిస్తారు. ఇది రైతుకు భరోసా ఇచ్చే ధర్నానా? లేక బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహించే రాజకీయ డ్రామానా..? అనేది తేలాలి. రైతుకు భరోసా ఇచ్చే ధర్నా అయితే.. వరి పండించండి, నేను మీకు అండగా ఉంటానంటూ చెప్పాలి. ధాన్యాన్ని ఇప్పటిదాకా కొన్నాను, ఇకముందు కూడా కొంటానని చెప్పాలి. దానికి బీజేపీ అడ్డొస్తుంది కాబట్టి, రైతులు, నేను, ప్రభుత్వం, అందరమూ కలిసి పోరాడాలంటూ స్పష్టమైన పిలుపునివ్వాలి. తద్వారా రైతుకు అండగా నిలబడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చెయ్యాలి. కానీ ఇప్పటికీ అన్నదాతకు అండగా కేసీఆర్ ఒక మాట మాట్లాడటం లేదు. రాష్ట్ర బీజేపీ నేతలను విమర్శిస్తూ... కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది కాబట్టి వరి వేయొద్దని సూచిస్తూ వస్తున్నాడు. అందువల్ల టీఆర్ఎస్ది అర్థం లేని ధర్నా అవుతుంది...'