Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు రైతులకు న్యాయం జరిగే వరకు గిరిజనుల పక్షాన పోరాడుతామనీ, ఇంచు భూమి కూడా వదిలేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన గిరిజన సమాఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు హక్కువల పత్రాల స్వీకరణలో మంత్రుల, ప్రజాప్రతినిధుల జోక్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు.ప్రతి పోడు రైతుకు హక్కు పత్రాలు దక్కే వరకు ఉద్యమాలు నిర్విహిస్తామని చెప్పారు. అనేక ఏండ్లుగా గిరిజనులు పోడు భూములను నమ్ముకుని బతుకుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బోడ వీరన్న. మంగీలాల్, లింగ నాయక్ .శ్రీనివాసు, రాజు తదితరులు పాల్గొన్నారు