Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి బొగ్గు కార్మికులకు రక్షణ కల్పించడంలో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం(ఏఐఎఫ్టీయూ) విమర్శించింది. గురువారం ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఎం.పోచమల్లు, మాతంగి రాజమల్లు ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరాంపూర్ బొగ్గుగనిలో నలుగురు కార్మికుల చావుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. గత వారం నుంచే కూలే ప్రమాదం ఉందని కార్మికులు చెప్పినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన నిర్లక్ష్య అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించాలనీ, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.