Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఫారెస్ట్రీ బీఎస్సీ ఆనర్స్-2017 బ్యాచ్ (నాలుగేండ్ల కోర్సు) విద్యార్థులకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలో శుక్రవారం సర్టిఫికెట్లను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి టి.హరీశ్‌రావు, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ పాల్గొననున్నారు. ఈ మేరకు అటవీ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 48 మందికి సర్టిఫికెట్లు అందజేయనున్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో ఒకరు 2021 సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించారు. నలుగురు డెహ్రాడూన్‌లోని ఎఫ్ఆర్ఐలో ఎమ్మెస్సీలో సీట్లు పొందారు. మరో విద్యార్థి మహారాష్ట్ర ఆగ్రోఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశం పొందారు. గ్రాడ్యుయేషన్ వేడుకలో అకాడమిక్ ఎక్సలెన్స్ కోసం పీసీసీఎఫ్ పతకం, ఓవరాల్ ఎక్సలెన్స్ కోసం డీన్స్ పతకం, ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ అవార్డు, గ్రీన్ ఇనిషియేటివ్స్ ఏకో, లీడర్ షిప్ ఎక్స్‌ట్రామైల్ అవార్డు, స్టూడెంట్ సర్వీస్ లీడర్ షిప్ అవార్డు, ప్రత్యేక ప్రతిభా పురస్కారం, వర్ధమాన వర్గీకరణ శాస్త్రవేత్త అవార్డు, ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డులను ఇవ్వనున్నారు. 2017 బ్యాచ్ విద్యార్థులు మూడు అటవీ అధ్యయన పర్యటనలు చేశారు. అటవీ శాస్త్రంలో 56 విభిన్న కోర్సులలో 180 క్రెడిట్లను పూర్తి చేశారు. తదుపరి విద్యార్ధులు అటవీ రేంజ్‌లలో వన్యప్రాణుల ప్రాంతాలలో పరిశ్రమలలో, ఎన్జీఓలలో, అర్బన్ ఫారెస్ట్రి, నాబార్డ్ వంటి వివిధ రంగాలలో అనుభం సాధించారు.