Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు కలెక్టరేట్ల ముందు ధర్నాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శుక్రవారం కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చింది. ఈమేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. వానాకాలం, యాసంగి సీజన్ల ధాన్యాన్ని ప్రభుత్వాలు కొనాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాగు చట్టాల అమలులో భాగంగానే యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమంటూ ప్రకటించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరారు.