Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు కలెక్టరేట్ల ముట్టడి
- ఎన్పీఆర్డీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల బంధు పథకం ప్రవేశ పెట్టాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం అన్ని కలెక్టరేట్లను ముట్టడించనున్నట్టు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధికారత, సమగ్రాభివద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు పూనుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాజంలో వికలాంగులు వెనుకబడి ఉన్నారని వాపోయారు. వారి అభివద్ధి కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టి చేయూత అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంలో 25 శాతం అదనంగా చెల్లిస్తున్నట్టుగానే దళిత బంధు పథకంలో కూడా ఇరవై ఐదు శాతం అదనంగా చెల్లించాలనీ, జీవో తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల్లో ఐదు శాతం వికలాంగులకు కేటాయించాలని కోరారు. లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలలని డిమాండ్ చేశారు.