Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామారెడ్డి జిల్లాలో పురుగుల మందు తాగి...
నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్
అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకు న్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం వదలపర్తి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ సుబ్రమణ్యాచారి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మున్నూరు యాదయ్య (48)కు ఆరెకరాల పొలం ఉంది. అయితే పంట పెట్టుబడ ితో పాటు ఇద్దరు కూతుళ్ల పెండ్లిండ్లు, ఇల్లు నిర్మాణం కోసం రూ.18లక్షల వరకు అప్పు అయ్యింది. అప్పుల బాధ భరించలేక తీవ్ర మనస్థాపం చెందిన రైతు పురుగుల మందు తాగాడు. నురగలు కక్కు తూ ఉండటంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మం డల కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సల హా మేరకు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మెదక్ ప్రభుత్వాస్ప త్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.