Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, మెడికల్ జేఏసీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో గురు వారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీ కన్వీనర్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, చైర్మెన్ డాక్టర్ బొంగు రమేశ్, సెక్రెటరీ జనరల్ డాక్టర్ నరహరి తదితరులు మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పెండింగ్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే డాక్టర్లతో సమావేశం నిర్వహిస్తానని సానుకూలంగా స్పందించినట్టు అనంతరం నాయకులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఉస్మానియా ఆస్పత్రి విభాగం అధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్‌తో పాటు డాక్టర్ అమర్ సింగ్, డాక్టర్ రమేశ్, డాక్టర్ యాకేందర్ ఉన్నారు.