Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ కు వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజారోగ్య వైద్యుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును ఆ విభాగానికి చెందిన డాక్టర్లు కోరారు. గురువారం హైదరాబాద్లో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్ డీఏ) నాయకులు డాక్టర్ కత్తి జనార్థన్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, కామారెడ్డి జిల్లా, ఉట్నూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏఎన్ఎంపై గుండాల దాడిని మంత్రికి వివరించినట్టు నాయకులు తెలిపారు.