Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం అందరికీ ఆదర్శమని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. ఆయన చేసిన సేవలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యా గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ఆధ్వర్యంలో 'నైపుణ్యవంతమైన విద్య'అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి సుల్తానియా పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మాట్లాడుతూ ఆజాద్ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారనీ, ఆయన త్యాగనిరతి సేవలను కొనియాడారు. చిన్నతనం నుంచే పత్రికలు, ఐఐటీలు, యూజీసీ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను స్థాపించారని గుర్తు చేశారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరికీ ఉన్నత విద్యావకాశాలు అందించడం కోసం కృషి చేయాలని కోరారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరిశోధనలు మరింత పెరగాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి అబ్దుల్ ఖాలిక్, మానసిక నిపుణులు శివకుమార్ కృష్ణన్, ఎంసీఆర్హెచ్ఆర్డీ ప్రతినిధి అమీనుల్లాఖాన్, తెలంగాణ ఉన్నత విద్యా గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) అధ్యక్షులు ఎం లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.