Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జనవరి ఆరు, ఏడు తేదీల్లో కలెక్టరేట్ల ఎదుట 48 గంటల పాటు వంటావార్పులు, ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(ఆషా) యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆశాలకు పెంచిన పీఆర్సీ డబ్బులను వెంటనే చెల్లించాలనీ, పదివేల రూపాయల ఫిక్స్డ్ వేతనం, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర నాయకులు లలిత, హేమలత, జాన్షి, అమల, పద్మ, సాధన, సుజాత, గంగమణి, రేవతి, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.