Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్సీయూ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒక రోజు దీక్ష
నవతెలంగాణ-మియాపూర్
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 బిల్లును వెనక్కి తీసుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ అధ్యక్షురాలు సహన డిమాండ్ చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని హెచ్సీయూ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒకరోజు నిరహార దీక్ష చేపట్టారు. ఈ సంద ర్భంగా వారు మాట్లా డుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఎడ్యుకేషన్ పాలసీ.. భవిష్యత్లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు చదువు దూరం చేసే విధంగా ఉందని తెలిపారు. యూనివ ర్సిటీలు పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోవడంతో పాటు ప్రయివేటు విద్యా సంస్థలకు అవకాశం ఇచ్చే విధంగా ఈ బిల్లులో అనేక అంశాలు ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కొంతమంది బడా కార్పొరేట్ కంపెనీలకు భారత దేశ విద్యా వ్యవస్థను అప్పజెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి బిల్లు తీసుకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే దేశవ్యాప్త ఆందోళన చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు శిరీష, సంజరు, నవీన్, యాసీన్, తదితరులు పాల్గొన్నారు.