Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల సమస్యలు పరిష్కరించలేని కేంద్రం గద్దె దిగాలి : వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్
నవతెలంగాణ-భద్రాచలం
లఖింపూర్ ఘటనలో అమరులైన నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ అస్తికలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరిలో వ్యకాస, రైతు, కార్మిక తదితర సంఘాల ఆధ్వర్యంలో వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ శుక్రవారం గోదావరిలో నిమజ్జనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు నల్ల చట్టాలైన.. వ్యవసాయ, విద్యుత్ చట్టాలు, కార్మికుల కోడ్లు రద్దు చేయాలనీ, లేకుంటే ప్రధాని మోడీ గద్దె దిగాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ ఘటనలో దోషిగా తేలిన మంత్రి కుమారుడైన అశిష్మిశ్రాను కఠినంగా శిక్షించాలన్నారు. తక్షణమే అజరుమిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలనీ, లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మిడియం బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి కున్సోత్ ధర్నా, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మాచారి, నాయకులు అన్నవరపు సత్యనారాయణ, వ్యకాస, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు జాతోత్ కృష్ణ, కొరాడ శ్రీనివాస్, సీఐటీయూ పట్టణ కన్వీనర్ వై.వి.రామారావు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు యం.బి.నర్సారెడ్డి, బండారు శరత్ బాబు, నాగరాజు, లక్ష్మణ్, కేవీపీఎస్, ఐద్వా, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.