Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కల్లుగీత వృత్తిని అవమానపరిచేలా టీపీసీసీ అధ్యక్షులు ఎ రేవంత్ రెడ్డి మాట్లాడారనీ, ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గురువారం ఆ పార్టీ శిక్షణా శిబిరాల్లో కేసీఆర్, బండి సంజరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కల్లు కంపౌండ్‌లో కల్లు తాగినోళ్లలాగా వ్యవహరిస్తున్నారని మాట్లాడటం..పరోక్షంగా కల్లుగీత వృత్తిదారులను అవమానించటమేనని తెలిపారు. రాజకీయ విమర్శలకు వృత్తిని ఉదహరించటం సరికాదని పేర్కొన్నారు.