Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లో నవ్య ప్రింటింగ్ ప్రెస్ ప్రొప్రైటర్ రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖండించింది. ఈ మేరకు న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు నేత ఆర్కె సాహిత్యం ప్రింట్ చేస్తున్నారనే ఆరోపణతో పోలీసులు ఆ ప్రింటింగ్ ప్రెస్ మీద దాడి చేసి సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. రామకృష్ణారెడ్డి అరెస్టును తప్పుపట్టారు. మరణించిన వ్యక్తుల రచనలను ముద్రించడం నేరంగా పరిగణించడం అన్యాయమని విమర్శించారు. ఇది నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.