Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహేశ్వర్రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఈనెల 14 నుంచి 21 వరకు జనజాగరణ ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తామని ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి చెప్పారు. కలెక్టర్ల అనుమతి తీసుకుని యాత్రలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను కోరారు. శుక్రవారం గాంధీభవన్లో సీనియర్ నాయకులు కోదండరెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు.ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలకు లోబడి యాత్రలు నిర్వహించాలని సూచించారు.ఖమ్మం జిల్లాలో మల్లు భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి,వికారాబాద్లో టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్రెడ్డి, మెదక్లో దామోదర్ రాజనర్సింహ,దాసోజు శ్రవణ్, వరంగల్లో కొండా సురేఖ, కొండా మురళి,సిరిసిల్ల జిల్లాలో మాజీ ఎంపీ రాజయ్య, కొత్తగూడెంజిల్లాలో పొడెం వీరయ్య, నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి, జనగాంలో పొన్నాల లక్ష్మయ్య, ములుగు జిల్లాలో ఎమ్మెల్యే సీతక్క పాల్గొంటారన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ ధర్నాలు చేస్తే కొనేది అమెరికానా? : భట్టి
ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ డ్రామాలాడుతున్నాయని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్రంలో పాలించే బీజేపీ, రాష్ట్రాన్ని పాలించే టీఆర్ఎస్...రోడ్డెక్కి ధర్నాలు చేస్తే ధాన్యం కొనాల్సింది అమెరికానా లేకా పాకిస్థానా? అని ప్రశ్నించారు. 'ధాన్యం కొనాల్సిన ప్రభుత్వాలు ఎందుకు ధర్నాలుచేస్తున్నాయని ప్రశ్నించారు. అధికారంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని విమర్శించారు.