Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ కొత్తగూడెం బ్రాంచ్ మాజీ కార్యదర్శి, సీఐటీయూ నేత వరాల మల్లయ్య తల్లి రాములమ్మ(95) మృతికి సీఐటీయూ, సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్(ఎస్సీఈయూ), సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం(ఎస్సీకేఎస్) రాష్ట్ర కమిటీలు సంతాపాలు ప్రకటించాయి. ఈ మేరకు ఎస్సీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు ఒక ప్రకటన విడుదల చేశారు. రాములమ్మ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాములమ్మ పార్థీవదేహంపై సీఐటీయూ రాష్ట్రకమిటీ తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.రాజారావు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.మధు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూని యన్ మాజీ నాయకులు కొండపల్లి పావన్, పప్పుల వెంకటి, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు ఎం.రవి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారని తెలిపారు. వరాల రాములమ్మ కుటుంబం కొత్తగూడెంలో కార్మిక ఉద్యమాలకు సహకారాన్ని అందించిందని గుర్తుచేశారు. రాములమ్మ అంత్యక్రియలు హైదరాబాద్లోని పంజాగుట్ట శ్మాశాన వాటికలో జరిగాయని తెలిపారు.