Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్మీ నివాసం, అపీజే సురేంద్ర(పార్క్)
- హోటళ్ల మధ్య నిర్వహణా ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో లగ్జరీ హౌటల్ ప్రాజెక్ట్ అందుబా టులోకి రానుంది. లక్ష్మీ నివాసం పేరుతో ఏర్పాటైన ఈ హౌటల్ యాదాద్రికి వచ్చే భక్తులకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లక్ష్మీ నివాసం డెవలపర్స్ దీన్ని నిర్మించింది. 400 సూట్ గదులు కలిగిన ఈ హౌటల్ జాతీయ స్థాయి ప్రమాణాలను కలిగి ఉంది. అన్ని వసతులు, సకల సదుపాయాలతో ఈ హోటల్‌ను ఏర్పాటు చేశారు. లక్ష్మీ నివాసం లగ్జరీ హౌటల్ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలను అపీజే సురేంద్ర హోటళ్ల గ్రూప్ (ది పార్క్) పర్యవేక్షించనుంది. దీనికి సంబంధించి లక్ష్మీ నివాసం, అపీజే సురేంద్ర హౌటళ్ల గ్రూపు మధ్య ఒప్పందం కుదిరింది. అపీజే సురేంద్ర హోటళ్ల గ్రూపు బ్రాండ్ అయిన జోన్ కనెక్ట్ కింద ఈ హోటల్‌ను నడపనుంది. వచ్చే ఏడాది మార్చి 20వ తేదీన ఇది ప్రారంభం కానుంది. ఒప్పందానికి సంబంధించిన వివరాలను లక్ష్మీ నివాసం డెవలపర్స్ ఛైర్మెన్ రాజేంద్రప్రసాద్, ది పార్క్ హోటళ్ల నేషనల్ హెడ్, జనరల్ మేనేజర్ వికాస్ అహ్లూవాలియా హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో వెల్లడించారు.