Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షుడిగా కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి ఎన్నిక
- పదకొండు సబ్ కమిటీల ఏర్పాటు
నవతెలంగాణ -రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం) రాష్ట్ర 3వ మహాసభలకు సంబంధించి శుక్రవారం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో ఆహ్వానసంఘం ఏర్పాటుసభ జరిగింది. ఈ మహా సభలు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో వచ్చే ఏడాది జనవరి 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం నర్సింహ్మ, శ్రీనివాస్ రెడ్డి, కవితల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు హాజర య్యారు. రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర 3వ మహాసభకు ఆహ్వాన సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈఆహ్వాన సంఘంలో అధ్యక్షులుగా కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతా రాములు, ఉపాధ్యక్షులుగా పి. యాదయ్య, కార్య దర్శిగా కాడిగల్ల భాస్కర్, కోశాధికారిగా సామెల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాసభ ఏర్పాట్లకు సంబంధించి 11 సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా రంగారెడ్డి జిల్లా నాయకులు దుబ్బాక రాంచందర్, మధుసూదన్‌రెడ్డి, ఎం.చంద్రమోహన్, రాజు, శోభన్, జగదీశ్, కిషన్, జంగయ్య, నర్సింహ, రావుల జంగయ్య, సీహెచ్ జంగయ్య, గోరెంకల నర్సింహ, కందుకూరి జగన్, నర్సిరెడ్డి, మల్లేశ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.