Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రియుడితో కలిసి బాలికను చంపిన కన్నతల్లి
- పంజాగుట్టలో బాలికమృతికేసులో వీడిన మిస్టరీ
- నిందితుల అరెస్ట్
నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్ పంజాగుట్ట పరిధి ద్వారాకాపురి కాలనీలో ఇటీవల లభ్యమైన గుర్తుతెలియని బాలిక మృతదేహానికి సంబంధించి కేసును పోలీసులు ఛేదించారు. తల్లే ప్రియుడితో కలిసి బాలికను చంపినట్టు తేలింది. నిందితులను అరెస్టు చేసి శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జాయింట్ సీపీ, వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.
రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌లో బాలిక తల్లి తల్లి హీన బేగం, ఆమె ప్రియుడు షేక్ మొహమ్మద్ ఖాదర్‌ను అరెస్టు చేశారు. బాలిక తల్లి హీన బేగం మియాపూర్‌లో ఉండేది. డబీర్‌పురాకు చెందిన ఖాదర్‌తో ఆమెకు టెడ్డి కాంపౌండ్ షేక్‌పేట్‌లో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. హీన బేగం తన పిల్లలను తీసుకుని అతనితో వెళ్లి ముంబయి, ఢిల్లీ, జైపూర్, మనాలి తిరిగొచ్చారు. అక్కడ డబ్బులు సరిపోక పిల్లలతో భిక్షాటన చేయించారు. చిన్నారి బేబీ మెహక్ బెగ్గింగ్ చేయడం ఇష్టం లేక ప్రతిఘటించింది. తనను నాన్న దగ్గరకు తీసుకెళ్లాలని మారాం చేసింది. దీంతో చిన్నారిని ఖాదర్, హీన బేగం కలిసి దారుణంగా కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి పంజాగుట్ట ద్వారాకపురి కాలనీలో ఓ షాపు వద్ద వదిలి వెళ్లారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో కేసు ఛేదించడం కష్టమైంది. చుట్టు పక్కల పరిసరాల్లో.. బస్టాండ్‌లో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. దాంతో జూబీ ్లబస్టాప్లో నిందితులను అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన పంజాగుట్ట ఏసీపీ పివీ గణేష్, ఇన్స్పెక్టర్ నిరంజన్‌రెడ్డిని, సిబ్బందిని సీపీ అంజనీకుమార్ అభినందించారు.