Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావు
- నీలోఫర్ ఆస్పత్రిలో 100 పడకల ఐసీయూ యూనిట్ ప్రారంభం
నవతెలంగాణ-మెహదీపట్నం
పదివేల కోట్ల రూపాయలతో ఆరోగ్య శాఖను బలోపేతం చేయనున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన 100 పడకల ఐసీయూ యూనిట్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ నాలుగు దిక్కులా 4మెడికల్ టవర్లను ఏర్పాటు చేసేందుకు సీఎం ప్లాన్ చేశారని తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజి ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంద న్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా ఇప్పుడు 21 అయ్యాయని, వచ్చే ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. రూ.33 కోట్లతో నీలోఫర్‌లో మరో 800 పడకలు అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్తగా డాక్టర్లను, అవసరమైన సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రూ.133 కోట్లు కేటాయించామన్నారు. మరో 5000 పడకలను సిద్ధంగా ఉంచామన్నారు. వ్యాక్సినేషన్లో రాష్ట్రం ముందంజలో ఉందని, దేశ సగటు కంటే తెలంగాణ సగటు ఎక్కువగా ఉందని చెప్పారు.