Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు వేదన దీక్షలో వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'కేసీఆర్‌కు మూడు వారాల గడువిస్తున్నాం..రైతుల నుంచి ధాన్యం కొనాల్సిందే..లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటా' అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో శనివారం ఆమె రైతు వేదన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆఖరి గింజ వరకు ధాన్యం కొంటానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట మార్చటమేంటని ప్రశ్నించారు. మాట నిలబెట్టుకోలేని సీఎం తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల తరపున ప్రజాస్వామ్య బద్ధంగా దీక్షలు చేస్తామన్నా అనుమతి నిరాకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.' శుక్రవారం నిరాహార దీక్ష చేయాలనుకున్నాం. కానీ ధర్నా చౌక్ వద్ద పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. కానీ..టీఆర్ఎస్ పార్టీకి మాత్రం అనుమతి ఇచ్చారు. దీంతో శనివారం ఉదయం 72 గంటల రైతు వేదన దీక్షకు పూనుకున్నాం. సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అనుమతిచ్చారు. మిగిలిన 48 గంటల దీక్షకు లోటస్ పాండ్‌లో చేయాలని తలపెట్టాం'. కానీ అక్కడ కూడా అనుమతి నిరాకరించడం అన్యాయమని విమర్శించారు.